Sun Dec 22 2024 18:05:21 GMT+0000 (Coordinated Universal Time)
కాకినాడ వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు
కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనకనుంచి కారు ఢీకొనింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆగి ఉన్న లారీని అతి వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
మృతుల వివరాలు...
మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న గండేపల్లి ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ వెనుక భాగం కారులో చిక్కుకున్న మృతదేహాల్ని బయటకు తీసేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు.
Next Story