Fri Mar 28 2025 10:07:18 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : జనాలపైకి దూసుకొచ్చిన పాల ట్యాంకర్.. ముగ్గురి మృతి
సిక్కింలోని రాణిపూర్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రజలపైకి పాల ట్యాంకర్ దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు

సిక్కింలోని రాణిపూర్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రజలపైకి పాల ట్యాంకర్ దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో ఇరవై మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయాలు పాలయిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
అతి వేగమే....
వేగంగా వచ్చిన పాల ట్యాంకర్ జనాలపైకి దూసుకు రావడంతోనే ఈ ప్రమాదం జరిగింది. అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదం సీీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయింది. జనాలపైకి దూసుకు రావడంతో కొందరు భయభ్రాంతులై పరుగులు తీశారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story