Tue Dec 24 2024 13:49:40 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర ప్రమాదం ... నలుగురు మృతి
కర్ణాటకలో ని ఉడిపి జిల్లా లో ఘోర ప్రమాదం జరిగింది. అంబులెన్స్ దూసుకు రాగా ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు
కర్ణాటకలో ని ఉడిపి జిల్లా లో ఘోర ప్రమాదం జరిగింది. శిరూర్ టోల్ ప్లాజా వద్దకు అంబులెన్స్ దూసుకు రాగా ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. అంబులెన్స్ లో ఉన్న నలుగురు మరణించారు. అతి వేగంగా టోల్ ప్లాజా వద్దకు వచ్చిన అంబులెన్స్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరికొందరు గాయాల పాలయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అంబులెన్స్ వేగంగా...
శిరూర్ టోల్ ప్లాజా వద్దకు అంబులెన్స్ చేరుకునే లోపే టోల్ గేట్ సిబ్బంది ఒక లేన్ కు ఉన్న బ్యారికేడ్లను తొలగించారు. అయితే నీరు ఎక్కువగా రోడ్డుపై నిలిచి ఉండటంతో వేగంగా వచ్చిన అంబులెన్స్ అదుపుతప్పి టోల్ గేట్ ను ఢీకొట్టింది. వేగాన్ని తగ్గించేందుకు డ్రైవర్ బ్రేక్ వేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. పోలీసు అధికారులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story