Mon Dec 23 2024 18:26:54 GMT+0000 (Coordinated Universal Time)
బస్సు దగ్గం.. ప్రయాణికులు మాత్రం
శింగనమల మండల పరిధిలో అనంతపురం -తాడిపత్రి ప్రధాన రహదారి పై ప్రవేటు ట్రావెల్స్ బస్సు టైరు పేలి ప్రమాదం జరిగింది.
అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. శింగనమల మండల పరిధిలో అనంతపురం -తాడిపత్రి ప్రధాన రహదారి పై ప్రవేటు ట్రావెల్స్ బస్సు టైరు పేలి ప్రమాదం జరిగింది. టైరు పేలడంతో బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు పూర్తిగా కాలి దగ్ధమైంది. అయతే డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.
అనంతపురం జిల్లాలో...
ఈ బస్సు బెంగళూరు నుంచి బనగానపల్లె కి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. తెల్లవారు జామున 4గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 29 మంది ప్రయాణికులున్నారు.
Next Story