Mon Dec 23 2024 14:46:45 GMT+0000 (Coordinated Universal Time)
నవీన్ హత్య తర్వాత స్నేహితుడికి హరి ఫోన్.. ఏమన్నా డ్రామానా ?
నవీన్ హత్యానంతరం.. హరి తన స్నేహితుడికి ఏమీ తెలియనట్టు ఫోన్ చేసి మాట్లాడిన ఆడియో కాల్ ఒకటి లీకైంది.
ప్రియురాలి కోసం స్నేహితుడైన నవీన్ ను హరిహరకృష్ణ అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. నవీన్ మిస్సింగ్ కేసు దర్యాప్తులో అతను దారుణ హత్యకు గురైనట్లు గుర్తించిన పోలీసులు.. నిందితుడు మూసారంబాగ్ కు చెందిన హరిహర కృష్ణ ను అరెస్ట్ చేసి, అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ 302, 301లతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్ పరిధిలో జరిగిన ఈ హత్యోదంతంలో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. నవీన్ హత్యానంతరం.. హరి తన స్నేహితుడికి ఏమీ తెలియనట్టు ఫోన్ చేసి మాట్లాడిన ఆడియో కాల్ ఒకటి లీకైంది. ప్రస్తుతం ఈ సంభాషణ వైరల్ గా మారింది.
నవీన్ ఎక్కడున్నాడో తెలియట్లేదు అన్న. వాళ్లింట్లో వాళ్లు నాకు ఫోన్ చేసి ఏడుస్తున్నారు. నా దగ్గరకి వచ్చి వెళ్లిపోయాడు. నీకేమన్నా తెలిస్తే చెప్పు అన్న. అంటూ.. నవీన్ స్నేహితుడితో హరిహర కృష్ణ జరిపిన ఫోన్ సంభాషణ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అప్పటికే నవీన్ ను హత్య చేసిన హరి.. అసలు తనకేమీ తెలియనట్టు ఎంతబాగా నటించాడో. పైగా నవీన్ కు డ్రగ్స్, గంజాయి, ఆల్కహాల్ అలవాట్లున్నాయని పేర్కొన్నాడు. అవతలి వ్యక్తి నవీన్ తన ప్రియురాలి కోసమే వచ్చినట్టున్నాడు. ఇప్పుడు కనిపించకపోవడం ఏంటి ? మిస్సింగ్ కేసు పెడదామా మరి అనే సరికి హరి అలా ఏం వద్దు అప్పుడే అని మెల్లగా జారుకున్నాడు. ఏదేమైనా ఒక అమ్మాయి కోసం యువకుడిని ఇంతదారుణంగా హతమార్చడం ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది.
Next Story