Mon Dec 23 2024 17:10:47 GMT+0000 (Coordinated Universal Time)
సత్యసాయి జిల్లా గ్యాంగ్ రేప్ కేసులో పురోగతి
సత్యసాయి జిల్లాలో గ్యాంగ్ రేప్ కేసులో నిందితులను గుర్తించినట్లు తెలిసింది.ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు
శ్రీసత్యసాయి జిల్లాలో గ్యాంగ్ రేప్ కేసులో నిందితులను గుర్తించినట్లు తెలిసింది. అత్యాచారానికి పాల్పడిన వారిని ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిన్న రెండు బైక్‌లపై వచ్చి అత్తాకోడలిపై అత్యాచారం చేసిన దుండగులను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ఆరుగురు అనుమాతులను...
బృందాలుగా విడిపోయి పోలీసులు ఈ గ్యాంగ్ రేప్ కేసులో నిందితుల కోసం గాలించారు. నిన్న నల్లబొమ్మనిపల్లి గ్యాంగ్‌రేప్ కేసులో కొంత పురోగతి లభించింది. పోలీసుల అదుపులో ఆరుగురు అనుమానితులు ఉన్నారని సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. వెంటనే ఈ కేసును సాల్వ్ చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
Next Story