Fri Dec 27 2024 04:06:55 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ యువకుడి హత్య కేసులో అరవై ఏళ్ల జైలు శిక్ష
అమెరికాలోని ఇండియానాలో తెలంగాణ విద్యార్థిని కత్తితో పొడిచి హత్య కేసులో నిందితుడికి 60 ఏళ్ల జైలు శిక్ష పడింది
అమెరికాలోని ఇండియానాలో తెలంగాణ విద్యార్థిని కత్తితో పొడిచి హత్య కేసులో నిందితుడికి 60 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు న్యాయస్థానం తీర్పు చెప్పింది. అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఫిట్నెస్ సెంటర్ లో తెలంగాణకు చెందిన వరుణ్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. గత ఏడాది అక్టోబర్ 29న పోర్టర్ టౌన్ షిప్ కు చెందిన 25 ఏళ్ల జోర్డాన్ ఆండ్రేడ్ వరుణ్ రాజ్ పుచ్చాను కత్తులతో దాడి చేశారు. తర్వాత భారతీయ విద్యార్థి అయిన వరుణ్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించాడు. వరుణ్ వయసు 24 ఏళ్లు. కాగా నిందితుడు జోర్డాన్ ఆండ్రేడ్ వయసు 25 ఏళ్లు.
ఈ హత్య కేసులో...
ఈ హత్య కేసులో పోర్టర్ సుపీరియర్ కోర్టు శిక్షను విధించారు. అరవై ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. వరుణ్ వాల్పరైసో యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ మాస్టర్ డిగ్రీని చదువుతున్నారు. ఫిట్ నెస్ సెంటర్ లో ఉన్న వరుణ్ ను దారుణంగా కత్తితో పొడిచి చంపడంతో తీవ్ర గాయాలపాలై తొమ్మిదిరోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వరుణ్ డిగ్రీ పూర్తి చేయడానికి అప్పటికి ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉంది. వరుణ్ రాజ్ మరణంతో ఆ కుటుంబం సర్వం కోల్పోయినట్లయింది. వరుణ్ తండ్రి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. వరుణ్ హత్యకు కూడా కారణాలు తెలియలేదు. అకారణంగా చంపేశారంటూ తండ్రి రామ్మూర్తి అన్నారు. అయితే ఆండ్రేడ్ కు అవరై ఏళ్ల శిక్ష విధిస్తున్నప్పుడు న్యాయస్థానంలో అతని తండ్రి జో ఆండ్రేడ్ కూడా ఉన్నాడు. పశ్చాత్తాపాన్ని తెలియజేస్తున్నానని చెప్పారు.
Next Story