Fri Dec 20 2024 08:14:36 GMT+0000 (Coordinated Universal Time)
ఫేమస్ కావాలనే షూట్ చేశాం
గ్యాంగ్‌స్టర్ ను కాల్చి చంపింది ఫేమస్ కావడం కోసమేనని నిందితులు తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్ ఘటనలో నిందితులు చెప్పిన నిజం.
గ్యాంగ్‌స్టర్ ను కాల్చి చంపింది కేవలం ఫేమస్ కావడం కోసమేనని నిందితులు తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్ ఘటనలో నిందితులు చెప్పిన నిజం. యూపీ గ్యాంగ్‌స్టర్, మాజీ పార్లంంటు సభ్యుడు అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌లను మీడియా, పోలీసుల సాక్షిగా ముగ్గురు యువకులు శనివారం రాత్రి పాయింట్ బ్లాంక్‌లో కాల్చిచంపిన విషయం తెలిసిందే. మీడియాలో ఈ కాల్పులు రికార్డు కావడం విశేషం.
గ్యాంగ్‌స్టర్ కాల్చివేత...
వీరిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. లవ్లేశ్ తివారీ, సన్నీ, అరుణ్ మౌర్యగా గుర్తించారు.ఈ ముగ్గురిని అరెస్టు చేసి విచారించగా తాము ఫేమస్ కావాలనే అతీక్ అహ్మద్‌ను షూట్ చేసినట్లు వీరు పోలీసులకు తెలిపారు. అందుకే పక్కా ప్లాన్ ప్రకారం పిస్టళ్లతో వెళ్లి కాల్చి చంపినట్లు పేర్కొన్నారు. కాల్పుల అనంతరం ముగ్గురు యువకులు ఘటనా స్థలంలోనే పోలీసులకు దొరికిపోయారు.
Next Story