Mon Dec 23 2024 09:58:16 GMT+0000 (Coordinated Universal Time)
దారుణం.. బాలికపై మేనమామ లైంగిక దాడి.. గొంతుకోసి, యాసిడ్ పోసి..
9వ తరగతి చదువుతోన్న బాలికపై మేనమామ లైంగిక దాడికి యత్నించగా.. ఆమె ప్రతిఘటించింది.
నెల్లూరులో జరిగిన ఓ ఘటనతో జిల్లా అంతా ఉలిక్కిపడింది. నెల్లూరు నగరానికి అతిసమీపంలో వెంకటాచలం మండలం చెముడుగుంట నక్కలకాలనీలో ఈ కిరాతకమైన ఘటన చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతోన్న బాలికపై మేనమామ లైంగిక దాడికి యత్నించగా.. ఆమె ప్రతిఘటించింది. దాంతో.. ఆ దుర్మార్గుడు బాలిక గొంతు కోసేశాడు. అక్కడితో నోట్లో యాసిడ్ పోశాడు. ఈ క్రమంలో బాలిక ముఖమంతా కాలి తీవ్రగాయాలపాలైంది. అరుపులు, కేకలు విన్న చుట్టుపక్కల వారు బాలికను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక కొనఊపిరితో చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.
బాలిక తండ్రి ఇంట్లో లేని సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు ఆమె మేనమామ నాగరాజు. ఇంట్లో అత్యాచారం చేసేందుకు ప్రయత్నించగా వారించిన బాలిక.. బాత్రూమ్ లోకి పరుగు తీసింది. అక్కడే ఆమెను బంధించిన నాగరాజు.. ఆమెపై యాసిడ్ పోశాడు. కత్తితో గొంతుకోసి తీవ్రంగా గాయపరిచాడు. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నాగరాజుని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. నాగరాజు కొన్నాళ్లుగా బాలికను వేధిస్తున్నట్లు తెలుస్తోంది. తన మేనమామ నాగరాజుని వదిలిపెట్టొద్దని పోలీసులను వేడుకుంది బాలిక.
Next Story