Wed Dec 18 2024 21:44:56 GMT+0000 (Coordinated Universal Time)
నటి అమలాపాల్ కు లైంగిక వేధింపులు.. స్నేహితుడు అరెస్ట్
భవ్ నిందర్ సింగ్ కుటుంబం, అమలాపాల్ కలిసి 2018లో ఓ ఫిల్మ్ కంపెనీని స్థాపించారు. విల్లుపురం జిల్లా..
కోలీవుడ్ నటి అమలాపాల్.. తనను తన స్నేహితుడు లైంగికంగా వేధిస్తున్నాడని తమిళనాడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు ఆమె స్నేహితుడిని అరెస్ట్ చేశారు. తను చెప్పినట్లు చేయకపోతే.. ఇద్దరం సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోలను బయటపెడతానని భవ్ నిందర్ సింగ్ దత్ వేధిస్తున్నాడని అమలాపాల్ తన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న విల్లుపురం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. భవ్ నిందర్ సింగ్ ను అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. భవ్ నిందర్ సింగ్ కుటుంబం, అమలాపాల్ కలిసి 2018లో ఓ ఫిల్మ్ కంపెనీని స్థాపించారు. విల్లుపురం జిల్లా కోటకుప్పం సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే ఉంటూ సినిమా ప్రొడక్షన్ వర్క్ చేసేవారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఆ సమయంలో వారిద్దరూ పెళ్లిచేసుకుంటారన్న వార్తలు సైతం గుప్పుమన్నాయి. ఆ తర్వాత ఏమైందో గానీ.. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి దూరమయ్యారు. ఇప్పుడు భవ్ నిందర్ సింగ్ తాము సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని భవ్నిందర్ తనను బెదిరిస్తున్నాడంటూ అమలాపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్థికంగా కూడా అతను తనను మోసం చేశాడని ఫిర్యాదులో తెలిపారు.
అమలాపాల్ ఫిర్యాదుతో.. పోలీసులు భవ్ నిందర్ సింగ్ ను అరెస్ట్ చేశారు. అమలాపాల్ నటించిన కడావర్ సినిమాను వీరిద్దరే కలిసి నిర్మించారు. ఆ సినిమా ఆగస్టు 12న డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైంది. సినిమా నిర్మాణానికి ఇద్దరూ డబ్బులు పెట్టగా.. భవ్ నిందర్ తనను ప్రొడక్షన్ కంపెనీ నుంచి తొలగించి నకిలీపత్రాలతో కంపెనీని తనసొంతం చేసుకున్నాడని అమలాపాల్ ఆరోపణ. దానిపై కూడా విచారణ చేసిన పోలీసులు.. అతను కొన్ని పత్రాలను ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. అమలాపాల్ ఫిర్యాదు చేసిన రెండు కేసులపై విచారణ జరుగుతోంది.
Next Story