Mon Dec 23 2024 07:22:13 GMT+0000 (Coordinated Universal Time)
డ్రగ్స్ కేసులో హీరోయిన్ భర్త అరెస్ట్
అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ ఎడ్విన్ కేసులో.. మైరాన్ తో పాటు హైదరాబాద్ కు చెందిన కృష్ణకిశోర్ రెడ్డిని ..
హైదరాబాద్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ నేహా దేశ్ పాండే భర్త మైరాన్ మోహిత్ ను పోలీసులు.. హైదరాబాద్ లోని ఓ పబ్ లో అరెస్ట్ చేశారు. అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ ఎడ్విన్ కేసులో.. మైరాన్ తో పాటు హైదరాబాద్ కు చెందిన కృష్ణకిశోర్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 12 సంవత్సరాలుగా మైరాన్ డీజే ముసుగులో డ్రగ్స్ సరఫరాలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు వెల్లడైంది. దేశంలో అనేక డీజే పార్టీలు, ఈవెంట్లు నిర్వహిస్తూ.. ప్రముఖ డీజేగా, ఇంటర్నేషనల్ ఈవెంట్ మేనేజర్ గా గుర్తింపు పొందాడు.
టాలీవుడ్ నటి నేహా దేశ్ పాండేను పెళ్లాడిన మైరాన్.. ముంబై కేంద్రంగా డరగ్స్ కార్యకలాపాలు సాగిస్తున్నాడు. పలు సినీ పరిశ్రమలకు చెందిన వ్యక్తులతో, వ్యాపారవేత్తలతో పరిచయాలున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వ్యాపారవేత్త కృష్ణకిశోర్ తెలుగు రాష్ట్రాల్లో పలు కాంట్రాక్టులు చేస్తూ.. ఎడ్విన్, మైరాన్ మోహిత్ లతో పరిచయం పెంచుకున్నాడు. వారిద్దరి ద్వారా ఇతర వ్యాపార వేత్తలకు, సినీ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తిచారు.
Next Story