Wed Jan 15 2025 08:13:23 GMT+0000 (Coordinated Universal Time)
కుటుంబ కలహాలతో మహిళా న్యాయవాది ఆత్మహత్య
శివాని తల్లి చెప్పిన సమాచారం ప్రకారం.. శివానికి చిన్నప్పుడే తండ్రి చనిపోతే మేనమామ ఆమె బాధ్యతలు తీసుకుని అడ్వకేట్ ను..
హైదరాబాద్ : కుటుంబ కలహాల కారణంగా మహిళా న్యాయవాది ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ లోని చందానగర్ లో చోటుచేసుకుంది. లక్ష్మీ విహార్ ఫేజ్ 1 డిఫెన్స్ కాలనీలో నివసించే న్యాయవాది శివాని ఐదేళ్లక్రితం అర్జున్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. వారికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో తాము నివసిస్తున్న అపార్ట్ మెంట్ నాల్గవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. శివాని ఆత్మహత్యానంతరం భర్త అర్జున్ చందానగర్ పోలీసులకు లొంగిపోయాడు.
శివాని తల్లి చెప్పిన సమాచారం ప్రకారం.. శివానికి చిన్నప్పుడే తండ్రి చనిపోతే మేనమామ ఆమె బాధ్యతలు తీసుకుని అడ్వకేట్ ను చేశారు. శివానిని చదివించటంతో తాను అప్పులు పాలయ్యానని అందుకోసం తనకు రూ. 10 లక్షలు ఇవ్వాలని మేనమామ వేధించేవాడు. పెళ్ళి అయిన తర్వాత సంపాదన మేనమామకు ఎందుకిస్తావని అర్జున్, శివానిల మధ్య పలుమార్లు గొడవ జరిగింది. ఈ నేపధ్యంలో శనివారం రాత్రి కూడా భార్య భర్తల మధ్య మరోసారి డబ్బుల విషయంలో గొడవ జరగడంతో.. విసిగిపోయిన శివాని అపార్ట్ మెంట్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతురాలి సోదరి,తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చందా నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.
Next Story