Sat Dec 21 2024 04:59:03 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీ ప్రేయసి హత్యకేసులో ట్విస్ట్.. ఫ్రిడ్జ్ లో డెడ్ బాడీ ఉండగానే మరో యువతితో..
నెలరోజుల తర్వాత ఆ అమ్మాయిని తన ఇంటికి పిలిపించుకున్నాడు. అప్పటికే ఫ్రిజ్లో శ్రద్ధ శరీర భాగాలు ఉన్నాయి. కానీ, అవి..
అఫ్తాద్ అమీన్ పూనావాలా అనే యువకుడు అత్యంత క్రూరంగా తన ప్రేయసి శ్రద్ధా వాకర్ ను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తనతో కలిసి ఉంటున్న ప్రేయసిని హత్య చేసి.. ఆమె శరీరాన్ని 35 ముక్కలు చేసి.. ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో వాటిని విసిరేశాడు. శ్రద్ధ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడంతో.. ఈ విషయం వెలుగు చూసింది. అఫ్తాద్ ను పోలీసులు విచారించగా.. సంచలన విషయాలు వెల్లడయ్యాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అఫ్తాద్ కు మరో అమ్మాయితో సంబంధం ఉన్నట్టు శ్రద్ధ అనుమానించింది. తనను పెళ్లి చేసుకోవాలని అఫ్తాద్ పై ఒత్తిడి చేసింది. ఇద్దరి మధ్య వాగ్యుద్ధం జరగ్గా.. తీవ్ర ఆగ్రహానికి గురైన అతడు.. శ్రద్ధ గొంతుకోసి హతమార్చాడు. అనంతరం 35 ముక్కలుగా నరికి ఫ్రిజ్లో దాచాడు. తర్వాత రోజూ అర్ధరాత్రి ఒక్కో ముక్కను ఢిల్లీలోని ఒక్కో ప్రాంతంలో పడేసి వచ్చాడు. శ్రద్ధను హత్య చేసిన తర్వాత డేటింగ్ యాప్ ద్వారా మరో అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు.
నెలరోజుల తర్వాత ఆ అమ్మాయిని తన ఇంటికి పిలిపించుకున్నాడు. అప్పటికే ఫ్రిజ్లో శ్రద్ధ శరీర భాగాలు ఉన్నాయి. కానీ, అవి ఆ అమ్మాయికి కనిపించకుండా వాటిని కప్ బోర్డులో దాచేవాడు. అంతేకాదు.. శ్రద్ధ ముఖాన్ని రోజూ చేసేందుకు వీలుగా ఆమె తలను తనవద్దే ఉంచుకున్నాడు. ఆమె శరీర భాగాలను దాచేందుకు అప్పటికప్పుడు 300 లీటర్ల కెపాసిటీ గల ఫ్రిడ్జ్ ను కొనుగోలు చేశాడు. హత్యకు సంబంధించి ఎలాంటి క్లూ దొరక్కుండా ఉండేందుకు ఏం చేయాలో ఇంటర్నెట్ లో చూసి తెలుసుకున్నాడు. క్లూస్ దొరక్కుండా సల్ఫర్ హైపోకెలోరిక్ యాసిడ్ వాడాడు. ఇలా చేయడం ద్వారా ఫోరెన్సిక్ నిపుణులకు కూడా దొరకకుండా రక్తపు మరకలు పూర్తిగా తుడుచుకుపోతాయని అతడి నమ్మకం. కాగా, అఫ్తాద్ ప్రవర్తనలో మార్పు రావడంతో.. అది నచ్చక అతడ్ని వదిలించుకునేందుకు శ్రద్ధ గతంలోనే ప్రయత్నించిందని, అయితే అది సాధ్యపడలేదని ఇద్దరికీ సన్నిహితంగా ఉండే స్నేహితులు పోలీసులకు తెలిపారు.
Next Story