Sat Nov 23 2024 14:43:58 GMT+0000 (Coordinated Universal Time)
ఓయో హోటల్ కు వెళ్లడమే ఆ జంట చేసిన తప్పా..?
ప్రైవసీ కోసం హోటల్స్ కు వెళుతుంటే.. అక్కడ జరుగుతున్న ఘటనలు కావరపెట్టే విధంగా ఉన్నాయి. హోటల్ గదిలో రహస్య కెమెరాను ఉంచి ఓ జంట కాయాకలాపాలను చిత్రీకరించిన ఇద్దరు వ్యక్తులను నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. దీంతో OYO రూమ్స్ విభాగం అంతర్గత దర్యాప్తు ప్రారంభించిందని అధికారులు శనివారం తెలిపారు. ఇద్దరు నిందితులు గత నెలలో ఫేజ్ 3 పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఒక గదిని బుక్ చేసుకున్నారు, అక్కడ తరహస్య కెమెరాను ఉంచారు. ఒక వారం తర్వాత, వారు అదే గదిని బుక్ చేసి అందులో పెట్టిన కెమెరాను తీసుకున్నారు. ఆ కెమెరాలో ఓ జంట సన్నిహితంగా ఉన్న వీడియో రికార్డ్ అయింది. ఆ వీడియోను ఆన్లైన్లో విడుదల చేస్తామని బెదిరిస్తూ ఆ జంటను బెదిరించడం మొదలుపెట్టారు. వారి దగ్గర నుండి డబ్బులు లాక్కోడానికి ప్రయత్నించారని అదనపు డీసీపీ (సెంట్రల్ నోయిడా) సాద్ మియాన్ ఖాన్ తెలిపారు.
నిందితులు విష్ణు సింగ్, అబ్దుల్ వహాబ్లను అరెస్టు చేయగా, పోలీసులు ఈ సంఘటనపై హోటల్ సిబ్బందిని కూడా ప్రశ్నించారు, అయితే ఇప్పటివరకు హోటల్ సిబ్బంది పాత్ర ఉందని కనుగొనబడలేదు. "ఈ సంఘటనలో హోటల్, దాని సిబ్బందికి ఇప్పటివరకు ప్రమేయం కనుగొనలేదు. నిందితులిద్దరూ గతంలో కూడా హోటల్లో బస చేశారు. ఇంకా ఎవరినైనా ఇలా బెదిరించారా అనే దశలో కూడా ఆరాతీస్తూ ఉన్నాము. "అని ADCP ఖాన్ PTI కి చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి OYO నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు, అయితే కంపెనీకి సంబంధించిన వ్యక్తులు ఈ విషయాన్ని అంతర్గతంగా విచారిస్తున్నట్లు చెప్పారు. ఐపీసీ సెక్షన్లు 420,386,506,467, 468, 471, 120బి కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
Next Story