Mon Dec 23 2024 07:40:45 GMT+0000 (Coordinated Universal Time)
రూపాను చంపింది అతడే.. లోపలికి వచ్చేటప్పుడు చెప్పిందిదే!!
ఒక ఫ్లాట్ తీసుకుని తన సోదరితో కలిసి ఉంటోంది. వీరితోపాటు రూపా బాయ్‌ఫ్రెండ్ కూడా
ముంబై: అంధేరి (తూర్పు)లోని ఫ్లాట్‌లో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఎయిర్ హోస్టెస్ రూపా ఓగ్రే హత్య జరగడం నగరాన్ని షాక్ కు గురిచేసింది. ఆమె ఫ్లాట్‌లో హౌజ్‌కీపింగ్ చేసే వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు గుర్తించారు. నిందితుడు విక్రమ్ అథ్వాల్ ను కోర్టులో హాజరుపరిచారు. ''ప్రాథమిక పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం, బాధితురాలిపై ఎలాంటి లైంగిక వేధింపులు జరగలేదు” అని ఒక పోలీసు అధికారి తెలిపారు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఫ్లాట్‌కు ఆమె స్నేహితుడు వెళ్లగా.. రక్తపు మడుగులో బాధితురాలి మృతదేహాన్ని కనుగొన్నారు. డోర్‌బెల్‌కు స్పందన లేకపోవడంతో కీమేకర్ను పిలిపించి డూప్లికేట్ కీతో లోపలికి వెళ్లారు. బాత్రూంలో రక్తపు మడుగులో పడి ఉన్న బాధితురాలిని కనుగొన్నారని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులకు ఫోన్ చేశారు.
రూపా ఓగ్రే ముంబయి ఎయిర్ ఇండియాలో ఎయిర్ హోస్టెస్ ట్రైనీగా విధుల్లో చేరారు. అంధేరీ హౌజింగ్ సొసైటీలో ఒక ఫ్లాట్ తీసుకుని తన సోదరితో కలిసి ఉంటోంది. వీరితోపాటు రూపా బాయ్‌ఫ్రెండ్ కూడా ఇదే ఫ్లాట్‌లో ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితమే అతను తన సొంతూరు వెళ్లాడు. రెండు రోజుల క్రితం రూపా తన ఫ్లాట్‌లో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఆమె గొంతును కత్తితో కోసిన ఆనవాళ్లు కనిపించాయి. రూపా ఫ్లాట్‌లో విక్రమ్ అట్వాల్ క్లీనింగ్ పనులు నిర్వహిస్తుండేవాడు. తన ఫ్లాట్‌లో విధులు సరిగా నిర్వహించట్లేదని రూపా అతనిని ఇటీవల మందలించింది. ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న విక్రమ్.. పక్కా ప్లాన్ చేసుకుని పదునైన ఆయుధంతో రూపా ఫ్లాట్‌కు వెళ్లాడు. ఫ్లష్ లీక్ ను సరి చేస్తానని అతడు చెప్పి లోపలికి వెళ్ళాడు. రూపా ఇంటికి వెళ్లి మొదట ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. రూపా విక్రమ్‌ని నెట్టివేసి బయటకు పారిపోడానికి ప్రయత్నం చేసింది. విషయం బయటపడుతుందని విక్రమ్ ఆమె గొంతును కోసి అక్కడి నుండి పారిపోయాడు.
పారిపోయే ముందు నేలపై ఉన్న రక్తపు మరకలను శుభ్రం చేశాడు. ఆ తర్వాత అతను తన యూనిఫాం తీసి, రక్తపు మరకలను కడిగేశాడు. ఆ తర్వాత కిందకు వచ్చి దుస్తులను మార్చుకుని పారిపోయాడని ఓ పోలీసు అధికారి తెలిపారు. అథ్వాల్‌ను అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, సెప్టెంబర్ 8 వరకు పోలీసు కస్టడీకి అప్పగించారు.
Next Story