Mon Dec 23 2024 11:04:22 GMT+0000 (Coordinated Universal Time)
యూపీలో దారుణం.. టీచర్ కొట్టడంతో దళిత విద్యార్థి మృతి
ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ఉపాధ్యాయుడు కొట్టడంతో దళిత విద్యార్థి మృతి చెందాడు.
ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ఉపాధ్యాయుడు కొట్టడంతో దళిత విద్యార్థి మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్ లోని ఔరియా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిఖిల్ డోహ్రే అనే విద్యార్థి పదో తరగతి చదువుతున్నాడు. అయితే పరీక్షల్లో ఒక పదం తప్పుగా రాసినందుకు సోషల్ టీచర్ అశ్విని సింగ్ ఆ విద్యార్థిని దారుణంగా కొట్టారు. దీంతో నిఖిల్ డోహ్రేని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు.
పదం తప్పుగా రాశాడని...
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిఖిల్ డోహ్రే మరణించారు. దీంతో ఆ పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. పదం తప్పు రాసినందుకు చనిపోయేలా కొట్టిన టీచర్ అశ్విని సింగ్ పై పోలీసులకు అతని తండ్రి రాజు డోహ్రే ఫిర్యాదు చేశారు. టీచర్ కొట్టడంతోపాటు కులం పేరుతో దూషించారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 24వ తేదీన రాజు డేహ్రే ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story