Mon Dec 23 2024 02:52:10 GMT+0000 (Coordinated Universal Time)
పిఠాపురంలో దారుణం.. బాలికపై అత్యాచారం
పిఠాపురంలో దారుణం చోటు చేసుకుంది. ఒక ఆటో డ్రైవర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది.
పిఠాపురంలో దారుణం చోటు చేసుకుంది. ఒక ఆటో డ్రైవర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది. ఇందిరా నగర్ లో ఉంటున్న బాలికను అడ్రస్ చూపించమని అడిగి మత్తు మందు చల్లిన డ్రైవర్ జానీ బాబు ఆటోలో నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు పెట్టడంతో ఆ చుట్టుపక్కలే చెత్త ఏరుకుంటున్న మహిళ గమనించి ప్రజలను పిలవడంతో ఆటో డ్రైవర్ జాన్ బాబును అదుపులోకి తీసుకున్నారు. జాన్ బాబు మాజీ కౌన్సిలర్ భర్తగా చెబుతున్నారు.
కిడ్నాప్ చేసి మరీ...
అతనికి ఒక మహిళ సహకరించిందని చెబుతున్నారు. దీంతో పోలీసులు మహిళను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలికపై అత్యాచారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు బాలికను ఆసుపత్రికి పంపి వైద్య పరీక్షలు చేయించిన తర్వాత కేసు నమోదు చేసే అవకాశముంది. బాలికను కిడ్నాప్ చేసి పిఠాపురం శివార్లలో ఉన్న డంపింగ్ యార్డు దగ్గరకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story