Thu Dec 19 2024 13:13:03 GMT+0000 (Coordinated Universal Time)
America : అమెరికాకు వెళ్లిన మన తెలుగోళ్లు చేసిన పని వింటే చీదరించుకోవాల్సిందే
అమెరికాకు ఉన్నతచదువులు చదువుకోవాలని పంపిస్తే మన తెలుగు యువకులు అక్కడ పిచ్చి వేషాలు వేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికారు.
అమెరికాకు ఉన్నతచదువులు చదువుకోవాలని పంపిస్తే మన తెలుగు యువకులు అక్కడ పిచ్చి వేషాలు వేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిన సంఘటన తాజాగా తెలియ వచ్చింది. సొలిసిటేషన్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ కింద వీరు అరెస్ట్ అయ్యారు. యువతులు వ్యభిచారంలోకి దించి వీరు డబ్బులు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. గల్లా మోనిష్, కుమ్మరి నిఖిల్, బండి నిఖిల్, మేకల జైకిరణ్ రెడ్డి, రాయపాటి కార్తీక్ లు అమెరికా పోలీసులకు చిక్కి మన దేశ పరువును తీశారు. అమ్మాయిలను వ్యభిచారంలోకి దించి డబ్బులు ఆర్జించే ప్రయత్నం చేశారు.
వారు వీరే...
ఈ నెల 14, 15వ తేదీల్లో అమెరికా పోలీసులు చేపట్టిన ఆపరేషన్ లో వీరంతా అడ్డంగా దొరికిపోయారు. డెంటన్ కౌంటీ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ లో వీరి బాగోతం బయటపడింది. పట్టుబడిన వారిలో ఏడుగురు భారతీయులుండగా అందులో ఐదుగురు తెలుగు వాళ్లే కావడం విశేం. వ్యభిచారంలోకి అమ్మాయిలను దించడంతో పాటు వారిని ప్రోత్సహించారని వారిపై కేసు నమోదయింది. అయితే గల్లా మోనిష్, మేకల జై కిరణ్ రెడ్డిపై తీవ్ర అభియోగాలు నమోదయ్యాయని తెలిపారు. అమెరికా చట్టాల ప్రకారం వీరికి భారీగా జరిమానా, జైలు శిక్ష పడే అవకాశముందని న్యాయనిపుణలు చెబుతున్నారు.
Next Story