Mon Dec 23 2024 07:48:36 GMT+0000 (Coordinated Universal Time)
కిటికీకి వేలాడుతూ దొంగ... 15.కిమీలు ప్రయాణం
రైలు కిటికీ చువ్వలు పట్టుకుని పదిహేను కిలోమీటర్ల మేర ఒక దొంగ ప్రయాణించిన సంఘటన బీహార్ లో జరిగింది
రైలు కిటికీ చువ్వలు పట్టుకుని పదిహేను కిలోమీటర్ల మేర ఒక దొంగ ప్రయాణించిన సంఘటన బీహార్ లో జరిగింది. బీహార్ లోని సాహిబ్ పూర్ కమాల్ స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. బెగుసరాయ్ నుంచి ఖగారియాకు రైలు బయలుదేరింది. ఈలోపు ప్లాట్ఫాం పై ఉన్న ఒక దొంగ కదిలిన రైలు ఎక్కి ఒక ప్రయాణికుడి సెల్ ఫోన్ కొట్టేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ ప్రయాణికుడు వెంటనే ఆ దొంగ చేయి పట్టుకున్నారు.
కిటికీ చువ్వలు పట్టుకుని...
రెండో చేతితో కిటికీ చువ్వ పట్టుకోగా రైలు అప్పటికే ప్లాట్ఫాం దాటి వేగం అందుకుంది. వెంటనే బోగీలో ఉన్న ప్రయాణికులు దొంగ రెండో చేతిని పట్టుకున్నారు. దీంతో ప్రయాణిస్తున్న రైలులో దొంగ పదిహేను కిలోమీటర్లు ప్రయాణించాడు. ఖగారియా రైల్వే స్టేషన్ చేరుకునేంత వరకూ చువ్వలు పట్టుకునే కిటీకీకి దొంగ వేలాడుతున్నాడు. అక్కడ రైల్వే పోలీసులకు ప్రయాణికులు దొంగను అప్పగించాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Next Story