Wed Dec 25 2024 06:16:25 GMT+0000 (Coordinated Universal Time)
ఇరవై కిలోమీటర్లు కారు బ్యానెట్పైనే
ఇరవై కిలోమీటర్లు కారు బ్యానెట్పైనే పడుకుని కానిస్టేబుల్ ప్రయాణించిన ఘటన మహారాష్ట్రలో జరిగింది.
ఇరవై కిలోమీటర్లు కారు బ్యానెట్పైనే పడుకుని కానిస్టేబుల్ ప్రయాణించిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. డ్రగ్స్ తీసుకుని కారు నడుపుతన్నాడన్న అనుమానంతో పట్టుకునేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ పోలీసును కారు బానెట్పైనే డ్రైవర్ ఇరవై కిలోమీటర్లు తీసుకెళ్లాడు. మహారాష్ట్రలోని నవీ ముంబయిలో ఈ ఘటన జరిగింది. సీసీ కెమెరాలో ఈ వీడియో రికార్డయింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
డ్రగ్స్ తీసుకున్నాడని...
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఒక కారు డ్రైవర్ డ్రగ్స్ సేవించి ఉన్నాడని అనుమానించి కారును ఆపేందుకు సిద్ధేశ్వర్ మలి అనే కానిస్టేబుల్ ప్రయత్నించాడు. అయితే కారు ఆపకుండా ముందుకు వెళ్లడంతో కానిస్టేబుల్ కారు బ్యానెట్పైనే పడుకుని ప్రయాణించాల్సి వచ్చింది. అయితే ఇరవై కిలో మీటర్ల దూరం తర్వాత డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఆదిత్య డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు పరీక్షల్లో గుర్తించారు. సాహసానికి ఒడిగట్టిన పోలీస్ కానిస్టేబుల్ ను ఉన్నతాధికారులు ప్రశంసించారు.
Next Story