Mon Dec 23 2024 11:27:40 GMT+0000 (Coordinated Universal Time)
మరో పబ్ లో మైనర్ల పార్టీ
గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్ లో రెండు రోజుల పాటు మైనర్లు పార్టీ చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది
Hyderabad : హైదరాబాద్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పబ్ ల యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మైనర్లను పబ్ ల్లోకి అనుమతిస్తున్నారు. ఇటీవల జూబ్లీహిల్స్ లోని యామ్నిషియా పబ్ తరహాలోనే గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్ లో రెండు రోజుల పాటు మైనర్లు పార్టీ చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ల పార్టీకి ఎక్సైజ్ శాఖ అనుమతించింది. అయినా ఒక రాజకీయ నేత ప్రమేయంతో మైనర్లను పబ్ లోకి అనుమతించారని తెలిసింది.
పట్టించుకోని యంత్రాంగం....
ఈ పబ్ లో పార్టీకి కొందరు సైబర్ టవర్స్ వాల్యూమ్ 11 పేరుతో ఈవెంట్ నిర్వహించారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా యువతీ యువకులను ఆహ్వానించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ ఈవెంట్ లో మైనర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారని చెబుతున్నారు. అయితే మైనర్లకు తాము మద్యం సరఫరా చేయలేదని పబ్ యాజమాన్యం చెబుతుంది. పబ్ లో పార్టీ జరుగుతున్నా పట్టించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Next Story