Mon Dec 23 2024 04:54:59 GMT+0000 (Coordinated Universal Time)
మద్యం మత్తులో రోడ్డుపై వెళుతున్న మహిళ బట్టలు చింపేశాడు
మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఒక మహిళ బట్టలు విప్పిన దారుణ ఘటన హైదరాబాద్
మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఒక మహిళ బట్టలు విప్పిన దారుణ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. షాపింగ్ కోసం రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళను లైంగికంగా వేధించాడో రాక్షసుడు. ఆమె తిరగబడే సరికి ఆమెపై కోపం పెంచుకొని దాడి చేశాడు. ఆమెను వివస్త్రను చేసి మరీ దారుణంగా కొట్టాడు. అడ్డుకోబోయిన వారిపై కూడా అతడు కొడుతూ ఉంటే పక్కనే ఉన్న తల్లి కుమారుడిని సమర్థించింది.
హైదరాబాద్ లోని జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్ నడిబొడ్డున రాత్రి ఎనిమిది గంటల సమయంలో అందరూ చూస్తుండగా... యువతిపై అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. షాపింగ్ కోసం రోడ్డుపై వెళ్తున్న గుర్తు తెలియని మహిళపై పెద్ద మారయ్య అనే వ్యక్తి లైంగికంగా వేధించాడు. తిరగబడిన ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఇష్టం వచ్చినట్లుగా కొడుతూనే ఉన్నాడు. అందరూ చూస్తుండగానే ఆమె బట్టలన్నీ చింపేసి వివిస్త్రను చేశాడు. అడ్డుకునేందుకు వెళ్లిన స్థానికులపై కూడా పెద్ద మారయ్య దాడికి పాల్పడ్డాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. బాధిత మహిళకు రక్షణ కల్పించారు. వేసుకునేందుకు బట్టలు ఇచ్చి ఇంటికి చేర్చారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు పెద్ద మారయ్యను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story