Mon Dec 23 2024 09:54:13 GMT+0000 (Coordinated Universal Time)
ఆత్మహత్య చేసుకున్న సురేష్
అనకాపల్లి జిల్లాలో బాలికను హత్య చేసిన నిందితుడు బోడాబత్తుల సురేష్
అనకాపల్లి జిల్లాలో బాలికను హత్య చేసిన నిందితుడు బోడాబత్తుల సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగు రోజులుగా నిందితుడు కోసం 12 బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలించారు. రాంబిల్లి మండలం కొప్పు గుండు పాలెం లో నిందితుడు సురేష్ మృతదేహం లభ్యమైంది. కొప్పగొండపాలెం పరిసరాలలో మృతదేహం కనిపించింది. అనకాపల్లి జిల్లాలో ఈ నెల 6న తొమ్మిదో తరగతి విద్యార్థినిని ప్రేమోన్మాది సురేష్ గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అక్కడి నుండి అతడు పారిపోయాడు.. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి పోలీసులు ఇటీవల రూ.50 వేల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించగా.. నిందితుడు అప్పటికే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
బాలిక రాంబిల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆమె స్కూల్కు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చింది. అయితే కొద్దిసేపటికి ఆ ఇంట్లోంచి సురేష్ బయటికి వచ్చాడు. అతడిని బాలిక నానమ్మ చూసింది.. వెంటనే ఇంట్లోకి వెళ్లి చూడగా బాలిక రక్తపు మడుగులో పడి ఉంది. ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించింది. ఆసుపత్రికి తీసుకెళ్లగా బాలిక అప్పటికే చనిపోయినట్లుగా వైద్యులు ధృవీకరించారు. సురేష్ బాలికను హత్య చేశాడని పోలీసులకు ఫిర్యాదు రాగా.. అంతలోనే సురేష్ ఆ ప్రాంతం నుంచి పారిపోయాడు. సురేష్ సొంతూరు కశింకోట. కొప్పుగుండుపాలెంలోని అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంటున్నాడు. జులాయిగా తిరుగుతూ బాలికను వేధిస్తున్నాడు. బాలిక కుటుంబ సభ్యులు అతడిపై ఏడాది క్రితం ఫిర్యాదు చేయడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు అయింది. ఇటీవల బెయిల్పై బయటకు వచ్చిన సురేష్ బాలికపై కక్ష పెంచుకుని హత్య చేశాడు.
- Tags
- Anakapalle
- Suresh
Next Story