Sun Mar 30 2025 06:12:19 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ ఎమ్మెల్యే అల్లుడు ఆత్మహత్య
అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాధరెడ్డి మృతి చెందారు

అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాధరెడ్డి మృతి చెందారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని కుంచనపల్లిలోని తన ఇంట్లో ఆయన మరణించారు. మంజునాధరెడ్డి కాంట్రాక్టరుగా ఉన్నారు. నాలుగేళ్ల క్రితం కాపు రామచంద్రారెడ్డి కుమార్తెతో మంజునాధరెడ్డికి వివాహమయింది. ఆమె డాక్టర్. అయితే అవంతి అపార్ట్మెంట్ లో నివిస్తున్న మంజునాధరెడ్డి శవమై కన్పించారు.
కారణాలు మాత్రం...
దీనికి కారణాలు తెలియరాలేదు. పోలీసులు అనుమానస్పద మృతిగా నమోదు చేశారు. ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేని మంజునాధరెడ్డి ఎందుకు మరణించారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గత కొంతకాలం నుంచి ఆయన ఒత్తిడితో ఉన్నారని బంధువులు చెబుతున్నారు. మంజునాధరెడ్డి స్వగ్రామం అన్నమయ్య జిల్లా రామాపురం మండలం హసనాపురం గ్రామం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story