Thu Apr 03 2025 05:09:10 GMT+0000 (Coordinated Universal Time)
వారణాసిలో ప్రాణాలొదిన తెలుగు కుటుంబం
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గురువారం వారణాసిలోని ఓ ఆశ్రమంలో

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గురువారం వారణాసిలోని ఓ ఆశ్రమంలో శవాలై కనిపించారు. ఆర్థిక సమస్యలతో కుటుంబసభ్యులు ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు.ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా డిసెంబర్ 3న కుటుంబసభ్యులు వారణాసికి వచ్చారు. డిసెంబరు 7వ తేదీ ఉదయం సొంతూరికి వెళ్లాల్సి ఉండగా.. సాయంత్రం వరకు వారి గది నుంచి ఎలాంటి కదలికలు కనిపించలేదు. పోలీసు అధికారుల సమక్షంలో గది తలుపులు బలవంతంగా తెరిచి చూడగా శవమై కనిపించారు. భర్త, భార్య, ఇద్దరు కుమారులు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా మండ పేట ప్రాంతానికి చెందినవారని తెలుస్తోంది.
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కొండబాబు (50) ఆయన భార్య లావణ్య (45) పిల్లలు రాజేశ్ (25), జైరాజ్‌లతో (23) కలిసి కైలాశ్ భవన్లో ఉంటున్నారు. గురువారం కుటుంబం అంతా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఓ సూసైడ్ నోట్ కూడా లభించిందని వారణాసి కమిషనర్ ఆఫ్ పోలీస్ అశోక్ ముథా జైన్ తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేకే తాము బలవన్మరణానికి పాల్పడినట్టు వారు చిట్టీలో రాశారని తెలిపారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని.. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.
Next Story