Mon Dec 23 2024 05:09:50 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖలో కిడ్నీ రాకెట్ కలకలం.. మోసపోవడంతో వెలుగులోకొచ్చిన దందా
వినయ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. ఈ క్రమంలో తిరుమల ఆస్పత్రిలో విచారించారు.
విశాఖలో కిడ్నీ రాకెట్ గుట్టురట్టయింది. డబ్బుల విషయంలో వ్యవహారం బెడిసికొట్టడంతో.. ఈ రాకెట్ గుట్టు బట్టబయలైంది. వివరాల్లోకి వెళ్తే.. పెందుర్తిలో కామరాజు, శ్రీను అనే ఇద్దరు మధ్యవర్తులు వినయ్ కుమార్ అనే వ్యక్తికి డబ్బు ఆశ చూపిస్తూ కిడ్నీ అడిగారు. కిడ్నీకి రూ.8,50,000 ఇస్తామని నమ్మబలికారు. నిజమేనని నమ్మిన వినయ్ తిరుమల ఆస్పత్రిలో కిడ్నీ ఇచ్చాడు. ఆపరేషన్ తర్వాత వినయ్ చేతుల్లో రెండున్నర లక్షలు పెట్టి.. మధ్యవర్తులిద్దరూ అడ్రస్ లేకుండా వెళ్లిపోయారు. తాను మోసపోయానని గ్రహించిన వినయ్ పోలీసులను ఆశ్రయించాడు.
వినయ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. ఈ క్రమంలో తిరుమల ఆస్పత్రిలో విచారించారు. మధ్యవర్తులైన కామరాజు, శ్రీను పరారీలో ఉండటంతో వారిద్దరి కోసం వెతుకున్నారు. పెందుర్తి కిడ్నీరాకెట్ పై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. శ్రీ తిరుమల హాస్పిటల్ లో తనిఖీల కోసం DM&HO ఆధ్వర్యంలో టీమ్ ను ఏర్పాటు చేశారు. కిడ్నీ మార్పిడి యూనిట్ లేకుండానే సర్జరీలు చేస్తున్నట్లు గుర్తించారు. డాక్టర్ పరమేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
2019లోనూ విశాఖపట్నంలో ఇలాంటి కిడ్నీ రాకెట్ కలకలం రేపింది. హైదరాబాద్ కు చెందిన వ్యక్తి నుంచి కిడ్నీ తీసుకొని ఓ గ్యాంగ్ అతన్ని మోసం చేసింది. కిడ్నీ ఇవ్వడానికి ఒప్పుకుంటే మొదట 12లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి, ఆపరేషన్ తర్వాత 5 లక్షలు మాత్రమే చెల్లించారు.
Next Story