Fri Dec 20 2024 18:06:33 GMT+0000 (Coordinated Universal Time)
ప్రాణాలు తీసిన పాత కక్షలు.. జంట హత్యలు
పాత కక్షలు ప్రాణాలు తీశాయి. ఇద్దరి ప్రాణాలు పోయాయి.
పాత కక్షలు ప్రాణాలు తీశాయి. ఇద్దరి ప్రాణాలు పోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లాలో జంట హత్యల కలకలం చోటుచేసుకుంది. పట్టపగలే దంపతులను దుండగులు నరికి చంపారు. మృతులను వీరకృష్ణ, వరలక్ష్మీగా గుర్తించారు. పాత కక్షల నేపథ్యంలో అయ్యంకి గ్రామంలో వీరంకి వరలక్ష్మి, ఆమె భర్త వీరంకి వీరకృష్ణలను దుండగులు దారుణంగా హత్య చేశారు. వరలక్ష్మీని నడిరోడ్డుపై చంపగా, ఆమె భర్త వీరంకి వీరకృష్ణ ను పంచాయతీ ఆఫీస్ దగ్గర దారుణంగా హత్య చేశారు.
తమ్ముడు కుటుంబంతో వీరకృష్ణ కు ఆస్తి గొడవలు ఉన్నాయి. 2009లో తమ్ముడు గణేష్ హత్య జరిగింది. గణేష్ హత్యకు వీరకృష్ణ కారణమని భావించి పగ పెంచుకున్నారు గణేష్ కొడుకులు. ఇదే అదును అనుకుని వీరకృష్ణ భార్యను గణేష్ కుమారులు గొడ్డళ్ళతో పట్టపగలు నడి రోడ్డులో హతమార్చారు. ఒకేరోజు జంట హత్యలు చోటుచేసుకోవడంతో ఆ ప్రాంత వాసులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి క్లూస్ టీం తో ఆధారాలు సేకరిస్తున్నారు. ఆధారాల కోసం దగ్గరిలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం కూచిపూడి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story