Thu Dec 19 2024 17:04:07 GMT+0000 (Coordinated Universal Time)
బైక్ మీద ఎక్కించుకుని గ్రౌండ్ కు తీసుకెళ్లారు
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో దారుణం చోటుచేసుకుంది. మదనపల్లెలో
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో దారుణం చోటుచేసుకుంది. మదనపల్లెలో అల్తాఫ్ అనే యువకుడిపై ముగ్గురు వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. అల్తాఫ్ ఇంటి నుంచి బయటకు వస్తుండగా బైక్ పై వచ్చిన ముగ్గురు యువకులు, అల్తాఫ్ ను అడ్డుకున్నారు. బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని మదనపల్లెలోని నవోదయ పాఠశాల దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ అందరూ చూస్తుండగానే అల్తాఫ్ పై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. స్థానికులు వెంటనే స్పందించి నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా వాళ్లు పరారయ్యారు. అక్కడే ఉన్న వాళ్లు మంటలను అదుపు చేసి 108కు సమాచారం ఇచ్చారు. తీవ్రంగా గాయపడిన అల్తాఫ్ ను మదనపల్లెలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యువకుడికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు.
బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అల్తాఫ్‌ను డీఎస్పీ పరామర్శించారు. ప్రేమ వ్యవహారమే ఈ దారుణానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కుటుంబ సభ్యుల నుండి పలు వివరాలు సేకరిస్తూ ఉన్నారు.
Next Story