Mon Dec 23 2024 06:19:07 GMT+0000 (Coordinated Universal Time)
భర్తను చంపడానికి చెంబు ఆయుధమైంది
ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం అయినవిల్లి
క్షణికావేశాలు ఎంతో మంది ప్రాణాలు తీస్తున్న సంగతి తెలిసిందే..! ఇక ముఖ్యంగా మద్యం ఎంతో మంది జీవితాలలో చీకటిని నింపుతూ ఉంది. తాగొచ్చి చిత్రహింసలు పెడుతున్న భర్తను భరించలేక చెంబు తో కొట్టింది భార్య. రోజూ తాగొచ్చి భార్యతో పాటూ తల్లిదండ్రులపైనా చేయి చేసుకునేవాడు. భర్త ఆగడాలతో విసిగిపోయిన భార్య అతడి తలపై చెంబుతో బలంగా కొట్టింది. భార్య కొట్టిన దెబ్బకు రామకృష్ణ మరణించాడు. భర్త హింసను భరించలేకే ఈ పని చేసినట్లు ఆమె కుటుంబసభ్యులకు చెప్పింది. ఆ తరువాత పోలీసుల ఎదుట లొంగిపోయింది.
ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం అయినవిల్లి లంకలో గురువారం అర్ధరాత్రి ఇసుకపట్ల రామకృష్ణ (34) భార్య చేతిలో హతమయ్యాడు. రోజూ మద్యం సేవించి భార్య సత్యనారాయణమ్మతో గొడవ పడేవాడు రామకృష్ణ. ఈ క్రమంలో గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో విసిగిపోయిన భార్య సత్య నారాయణమ్మ చెంబుతో భర్త తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే రామ కృష్ణ మృతి చెందాడని స్థానికులు తెలిపారు. నారాయణమ్మ పోలీసుల ఎదుట లొంగిపోయింది. రామకృష్ణ ఇంటికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story