Fri Dec 20 2024 18:23:11 GMT+0000 (Coordinated Universal Time)
జైలు నుండి బయటకు వచ్చి.. పిల్లల దగ్గరకు వెళ్ళాడు
రామకృష్ణ , ఆరాధ్య లు రాయపట్నం ప్రభుత్వ పాఠశాలలో 3, 1 తరగతులు చదువుతున్నారు. సోమవారం సాయంత్రం పాఠశాలకు వెళ్లిన శివరామగో
ఖమ్మం జిల్లా మధిర మండలం రాయపట్నంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యతో ఉన్న విబేధాల నేపథ్యంలో ఓ తండ్రి కన్న బిడ్డలను దారుణంగా హత్య చేశాడు. మధిర మండలం రాయపట్నం గ్రామానికి చెందిన పార్షపు శివరామ గోపాల్, మార్తమ్మ దంపతులు. వీరికి ఇద్దరు చిన్నారులు ఉన్నారు. తరచుగా ఈ దంపతుల మధ్య గొడవలే. ఇటీవల శివరామగోపాల్ దొంగతనం కేసులో జైలుకు వెళ్లాడు. మూడు రోజుల కిందటే విడుదలై వచ్చాడు. భార్య మార్తమ్మ రాయపట్నం గ్రామంలోనే ఉన్న పుట్టింట్లో ఉంటుంది. జైలు నుండి వచ్చిన తర్వాత మళ్లీ వాళ్ళిద్దరి మధ్య గొడవ అయింది. కోపం పెంచుకున్న శివరామ గోపాల్ తన బిడ్డలైన రామకృష్ణ (8), ఆరాధ్య (6)లను చంపేశాడు.
రామకృష్ణ , ఆరాధ్య లు రాయపట్నం ప్రభుత్వ పాఠశాలలో 3, 1 తరగతులు చదువుతున్నారు. సోమవారం సాయంత్రం పాఠశాలకు వెళ్లిన శివరామగోపాల్ పిల్లల్ని తనతో తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లోనే వారి గొంతు నులిమి చంపేసి, శవాలను దుప్పట్లో మూటకట్టి పరారయ్యాడు. పిల్లలను తీసుకొచ్చేందుకు మార్తమ్మ పాఠశాలకు వెళ్లగా వాళ్ల నాన్న వచ్చి తీసుకెళ్లాడని సిబ్బంది తెలిపారు. మార్తమ్మ ఇంటికి వెళ్లి చూడగా ఇంటికి తాళం వేసి ఉంది. అనుమానం వచ్చిన మార్తమ్మ చుట్టుపక్కల వారి సహాయంతో ఇంటి తాళం పగలగొట్టింది. లోపలికి వెళ్లి చూడగా ఇద్దరు పిల్లలు దుప్పట్లో చుట్టేసి ఉండడాన్ని గుర్తించారు. వైద్యులను సంప్రదించగా అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. పోలీసులకు సమాచారం అందించారు. పిల్లల మృతదేహాలని మధిర ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శివరామ గోపాల్ కోసం గాలిస్తున్నారు.
Next Story