Mon Dec 23 2024 02:10:32 GMT+0000 (Coordinated Universal Time)
Hydrabad : యువకుడిపై పోక్సో కేసు నమోదు
హైదరాబాద్ లో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ చిన్నారిపై అత్యాచారం ఘటన వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ లో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ చిన్నారిపై అత్యాచారం ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నగరం శివారు ప్రాంతంలో ఉన్న రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఇంట్లో ఒంటరిగా ఉన్న ఏడేళ్ల చిన్నారిపై పద్దెనిమిదేళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
ఇంట్లో ఉండగా...
ఆ చిన్నారికి మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి యువకుడు పాల్పడ్డాడని పోలీసులు నమోదు చేసిన కేసులో పేర్కన్నారు. అయితే చిన్నారి తల్లి ఇంటికి వచ్చి చూసే సరికి రక్తస్రావం అవుతుండటంతో ఆసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఆమె ఫిర్యాదుతో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Next Story