Tue Dec 24 2024 13:12:08 GMT+0000 (Coordinated Universal Time)
కాకినాడ షుగర్ ఫ్యాక్టరీలో మళ్లీ ప్రమాదం.. ఇద్దరు మృతి
10 రోజుల క్రితం ఈ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగినపుడు జిల్లా కలెక్టర్ సహా ఎవరూ పట్టించుకోలేదని కార్మికులు, స్థానికులు..
కాకినాడ షుగర్ ఫ్యాక్టరీలో మరోసారి పేలుడు సంభవించింది. కాకినాడ రూరల్ వాకలపూడి పారీ షుగర్ ఫ్యాక్టరీలో మరోసారి బాయిలర్ పేలగా.. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. 10 రోజుల వ్యవధిలో ఇక్కడి ప్యారీ షుగర్ పరిశ్రమలో ఇది రెండో ప్రమాదం. కాగా.. ప్రమాదంలో చనిపోయినవారు గొల్లప్రోలుకు చెందిన రాగం ప్రసాద్, వట్టపూడి కె. గంగవరానికి చెందిన పేరురి సుబ్రహ్మణ్యస్వరరావుగా గుర్తించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా.. పది రోజుల క్రితం ఈ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగినపుడు జిల్లా కలెక్టర్ సహా ఎవరూ పట్టించుకోలేదని కార్మికులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల మరోసారి పేలుడు జరిగి ఇద్దరు చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 19వ తేదీన ప్యారీ షుగర్స్ రిఫైనరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా కన్వేయర్ బెల్ట్ పేలడంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో తొమ్మిది మందికి కాలిన గాయాలయ్యాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని, అలాగే షుగర్ ఫ్యాక్టరీలో పేలుళ్లు ఎందుకు సంభవిస్తున్నాయో ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story