Fri Dec 20 2024 11:39:45 GMT+0000 (Coordinated Universal Time)
శిల్పా పై టాలీవుడ్ హీరో భార్య ఫిర్యాదు
శిల్పా చౌదరిపై మరో కేసు నమోదయింది. టాలీవుడ్ హీరో భార్య ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శిల్పా చౌదరిపై మరో కేసు నమోదయింది. టాలీవుడ్ హీరో భార్య ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై నార్సింగి పోలీసులు శిల్పా చౌదరిపై కేసు నమోదు చేశారు. కిట్టీ పార్టీల్లో తనకు శిల్పా చౌదరి పరిచయం అయిందని, తాను రెండు కోట్ల తొంభయి లక్షల రూపాయలన ఆమెకు ఇచ్చినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తీసుకున్న డబ్బులు ఇవ్వకుండా తనను ఇబ్బంది పెడుతున్నారని ఆమె పేర్కొంది.
బ్యాంకు అకౌంట్లను....
మరోవైపు శిల్పా చౌదరి బ్యాంకు అకౌంట్లను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమెను మరింత విచారించాల్సి ఉందని, నగదును ఎక్కడికి మరల్చారో తెలుసుకోవాల్సి ఉందన్నారు. మరికొన్ని బ్యాంకు అకౌంట్లు కూడా ఉన్నట్లు అనుమానం కలుగుతుందన్నారు. శిల్పా చౌదరి ప్రముఖల నుంచి దాదాపు 100 కోట్లు వసూలు చేసి మోసం చేసిందని పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి.
Next Story