Mon Dec 23 2024 10:51:05 GMT+0000 (Coordinated Universal Time)
హైద్రాబాద్ లో మరో అగ్నిప్రమాదం.. జూబ్లీ 800లో చెలరేగిన మంటలు
సోమవారం రాత్రి సికింద్రాబాద్ లోని రూబీ లాడ్జి సెల్లార్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది మృతి చెందగా..
హైదరాబాద్ నగరంలో మరో అగ్నిప్రమాదం జరిగింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఉన్న ఓ పబ్ లో మంగళవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జూబ్లీ 800 పబ్ లోని మూడో అంతస్తులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. కాగా.. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాద సమయంలో భవనంలో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు.
సోమవారం రాత్రి సికింద్రాబాద్ లోని రూబీ లాడ్జి సెల్లార్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది మృతి చెందగా.. మరో 10మందికి తీవ్రగాయాలయ్యాయి. వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పీఎం మోదీ సహా.. పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. హోటల్ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story