Sun Dec 22 2024 18:11:18 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : హైదరాబాద్లో మరో హిట్ అండ్ రన్ కేసు...కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదం.. ఇద్దరు వ్యక్తుల మృతి
హైదరాబాద్లో మరో హిట్ అండ్ రన్ కేసు వెలుగులోకి వచ్చింది. నగరంలోని కేబుల్ బ్రిడ్జిపై కొద్దిసేపటి క్రితం ప్రమాదం జరిగింది.
హైదరాబాద్లో మరో హిట్ అండ్ రన్ కేసు వెలుగులోకి వచ్చింది. నగరంలోని కేబుల్ బ్రిడ్జిపై కొద్దిసేపటి క్రితం ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. కేబుల్ బ్రిడ్జిపై నడుచుకుంటూ వెళుతున్న ఇద్దరు వ్యక్తులను గుర్తు తెలియని వాహనం ఢీకొనింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. కేబుల్ బ్రిడ్జిపై ఫొటోలు దిగుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
సీసీ టీవీ ఫుటేజీని...
అయితే ఏ వాహనం వీరిని ఢీకొనింది అయితే మాత్రం తెలియరాలేదు. పోలీసులు సీసీ టీపీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కేబుల్ బ్రిడ్జిపై నడుచుకుంటూ వెళుతున్న వారిని ఢీకొట్టడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని, మృతుల వివరాలు కూడా తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story