Thu Dec 19 2024 08:46:10 GMT+0000 (Coordinated Universal Time)
Tspsc : మరో అరెస్ట్
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మరొకరు అరెస్టయ్యారు. స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం పోలీసులు ఈ అరెస్ట్ చేశారు
తెలంగాణలో టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మరొకరు అరెస్టయ్యారు. స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం పోలీసులు ఈ అరెస్ట్ చేశారు. న్యూజిలాండ్ నుంచి వచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో టీఎస్పీఎస్సీ కేసులో ఇప్టటి వరకూ అరెస్ట్ అయిన వారి సంఖ్య వందకు పైగానే ఉంది. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసును ప్రతిష్టాత్మంకగా తీసుకున్న ప్రభుత్వం ఈ కేసును విచారించేందుకు సిట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సిట్ అధికారులు వరస అరెస్ట్ లు చేస్తూనే ఉన్నారు.
న్యూజిలాండ్ నుంచి వచ్చిన...
తాజాగా అరెస్ట్ అయిన వ్యక్తి సాన ప్రశాంత్ అని తెలిపారు. ఇతడు టీఎస్పీఎస్సీలో నెట్వర్క్ అడ్మిన్ గా పనిచేసిన రాజశేఖర్ రెడ్డి బావమరిది. న్యూజిలాండ్ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను కూడా గ్రూప్ 1 పరీక్ష రాశాడు. రెండు రోజుల క్రితం న్యూజిలాండ్ నుంచి హైదరాబాద్ కు వచ్చారని తెలుసుకున్న పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని న్యాయస్థానం ఎదుట హాజరు పర్చారు. న్యాయస్థానం సానా ప్రశాంత్ కు రిమాండ్ విధించింది. దీంతో అతడిని చంచల్గూడ జైలుకు తరలించారు.
Next Story