Fri Jan 10 2025 08:43:57 GMT+0000 (Coordinated Universal Time)
జంగారెడ్డి గూడెంలో మరొకరు మృతి.. 17కు చేరిన మృతులు
జంగారెడ్డి గూడెంలో నాటుసారా తాగిన ఘటనలో మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 17కు చేరుకుంది.
జంగారెడ్డి గూడెంలో నాటుసారా తాగిన ఘటనలో మరొక ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 17కు చేరుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో నాటు సారా తాగి అనేక మంతి ఏరియా ఆసుపత్రిలో చేరారు. కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. నాటు సారా కల్తీ కావడంతో ఇంతమంది చనిపోయారని బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. వారం రోజుల్లోనే పది మంది చనిపోయారు.
నాటుసారా విక్రయాలు....
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో నాటుసారా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఎక్కువగా పేదలు నాటుసారాను తాగుతున్నారు. మద్యం ధరలు ఎక్కువగా ఉండటంతో నాటుసారాకు ఎక్కువమంది ఈ ప్రాంతంలో అలవాటు పడ్డారని బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. నాటుసారా కాటుకు మరో ఇద్దరు బలయ్యారు. దీంతో నాటుసారా తాగి మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 17కు చేరుకుంది. అధికారులు మాత్రం ఇది నాటుసారా మరణాలు కావని అంటున్నారు. వారికి ఉన్న అనారోగ్య సమస్యల కారణంగానే చనిపోయారని అంటున్నారు.
Next Story