Mon Dec 23 2024 01:21:10 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident : రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లాలో మరో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి చెందారు
వరంగల్ జిల్లాలో మరో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. నలుగురు ఇంటర్మీడియట్ చదువుతునన విద్యార్థులుగా గుర్తించారు. వర్థన్నపేట మండలం ఆఆకేరు వాగు వంతెన వద్ద ఈ ఘటన జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళుతూ ప్రయివేటు బస్సు ను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు వర్ధన్నపేటకు చెందిన పొన్నం గణేశ్, ఇల్లంద గ్రామానికి చెందిన మల్లేపాక సిద్ధు, వరణ తేజ్, పొన్నాల రవికుమార్ లు నలుగురు బైక్ వస్తూ ప్రయివేటు ట్రావెల్స్ బస్సు ను ఢీనొన్నారు.
బస్సు ను ఢీకొట్టడంతో...
కాంగ్రెస్ సభకు వెళ్లి ఆ బస్సు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిోయారు. వీరిలో గణేశ్ బుధవారం విడుదలయిన ఇంటర్ ఫలితాల్లో పాస్ అయ్యాడని బంధువులు చెబుతున్నారు. నలుగురు విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఒక్కరే కుమారులు కావడంతో నాలుగు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story