Sun Dec 22 2024 17:19:28 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్
జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. జానీ మాస్టర్ భార్యపై కేసు నమోదుకు పోలీసులు సిద్ధం చేశారు.
జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. జానీ మాస్టర్ భార్యపై కేసు నమోదుకు పోలీసులు సిద్ధం చేశారు. జానీ మాస్టర్ పై ఇప్పటికే పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను గోవాలో అరెస్ట్ చేసి ఉప్పరపల్లికోర్టులో నిన్న హాజరుపర్చారు. జానీ మాస్టర్ కు 14 రోజుల రిమాండ్ విధించారు.
బాధితురాలి ఇంటికి వెళ్లి...
అయితే తాజాగా జానీ మాస్టర్ భార్యపై కూడా కేసు నమోదు చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారని తెలిసింది. బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించారన్న కారణంపై జానీ మాస్టర్ భార్యపై కేసు నమోదు చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు పోలీసుల నుంచి వచ్చి సమాచారం బట్టి తెలిసింది.
Next Story