Mon Dec 23 2024 08:59:10 GMT+0000 (Coordinated Universal Time)
Online Games : ఆన్ లైన్ గేమ్స్ కు అలవాటు పడి మరో యువకుడి మృతి
ఆన్ లైన్ గేమ్ వ్యసనానికి మరో యువకుడు బలయ్యాడు. వరంగల్ కు చెందిన ప్రశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు
ఆన్ లైన్ గేమ్స్ యువకుడి ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. ఆన్ లైన్ గేమ్ వ్యసనానికి మరో యువకుడు బలయ్యాడు. వరంగల్ కు చెందిన ప్రశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి బ్యాంకు అకౌంట్ నుంచి ఆన్ లైన్స్ గేమ్ ఆడిన ప్రశాంత్ రెండు లక్షల రూపాయలు పోగొట్టుకోవడంతో నిరాశకు గురయ్యాడు. తల్లిదండ్రులు తనను రెండు లక్షలు పోగొట్టానని తిడతారని భావించి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
రెండు లక్షలు పోగొట్టుకుని...
చదువుకున్న యువకులు ఆన్ లైన్ గేమ్స్ కు అలవాటు పడి ప్రాణాలు తీసుకుంటున్నారు. దానిని అలవాటుగా మార్చుకుని లక్షల రూపాయల సొమ్మును పోగొట్టుకుని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రశాంత్ మృతితో వారి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కొడుకు అందివచ్చి తమను ఆదుకుంటాడనుకుంటే ఇలా అర్థాంతరంగా ప్రాణాలు వదలడంపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందుకే ఆన్ లైన్ గేమ్స్ కు యువత దూరంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.
Next Story