Fri Oct 18 2024 04:13:56 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో ఏసీబీ సోదాలు.. ఆరు చోట్ల ఏకకాలంలో
ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారంతో అవినీతి శాఖ అధికారులు హైదరాబాద్ లో సోదాలు నిర్వహిస్తున్నారు
ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు హైదరాబాద్ లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్ నగరంలోని ఆరు ప్రదేశాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆయన ఇంటితో పాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు.
ఏసీపీ ఇంట్లో...
ఏకకాలంలో జరుగుతున్న ఈ దాడుల్లో అనేక కీలక విషయాలు వెలుగుచూశాయంటున్నారు. సాహితీ ఇన్ఫ్రా కేసులో ఉమామహేశ్వరరావు విచారణాధికారిగా వ్యవహరిస్తున్నారు. సైబర్‌క్రైం డిపార్ట్మెంట్ మూడో టీంలో ఏసీపీగాఉన్న ఉమామహేశ్వరరావు వద్ద ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న అనుమానంతో ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.
Next Story