Wed Apr 23 2025 03:40:21 GMT+0000 (Coordinated Universal Time)
పల్నాడులో ఘోర ప్రమాదం.. సీఎం దిగ్భ్రాంతి
పల్నాడు జిల్లా ముప్పాళ్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

పల్నాడు జిల్లా ముప్పాళ్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళా కూలీలు మృతి చెందారు. బొల్లవరం పరిధిలోని మాదల మేజర్ కాలువ కట్టపై ఆదివారం సాయంత్రం కూలీలతో వస్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో నలుగురు మహిళా వ్యవసాయ కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి.
చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన మహిళా కూలీలు మిరపకోతలకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మధిర సామ్రాజ్యం (50), మధిర గంగమ్మ (55), చక్కెర మాధవి (30), తేనెపల్లి పద్మావతి (45) మృతి చెందారు. క్షతగాత్రులు సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమని సీఎం అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
Next Story