Mon Dec 23 2024 01:02:22 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ హైకోర్టు న్యాయవాది అనుమానాస్పద మృతి
మూడ్రోజులుగా వెంకటేశ్వర్లు కనిపించకపోవడంతో.. ఆయన ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. కర్నూలు శివారులో..
కర్నుల్ : ఏపీ హైకోర్టు న్యాయవాది అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కర్నూల్ సిటీ శివారులో లాయర్ ఆవుల వెంకటేశ్వర్లు శవమై కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. లాయర్ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. లాయర్ వెంకటేశ్వర్లు మూడ్రోజుల క్రితం తన తమ్ముడి వద్ద వెళ్లి, అక్కడి నుంచి తిరిగి ఇంటికి బయల్దేరారు. కానీ.. ఇంటికి చేరుకోలేదు.
మూడ్రోజులుగా వెంకటేశ్వర్లు కనిపించకపోవడంతో.. ఆయన ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. కర్నూలు శివారులో మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందడంతో దీనిపై విచారణ ప్రారంభమైంది. గుర్తు తెలియని వ్యక్తులు వెంకటేశ్వర్లుని హత్యచేసి రోడ్డుపక్కన పడేసి ఉండవచ్చని ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
Next Story