Sun Nov 17 2024 22:37:39 GMT+0000 (Coordinated Universal Time)
కెనడాలో తెలుగు విద్యార్థి మృతి
సిల్వర్ ఫాల్స్‌కి విహారయాత్రకు వెళ్లారు. వారిద్దరూ ఒడ్డున కూర్చొని ఉండగా, లెనిన్ మరో స్నేహితుడితో కలిసి జలపాతం దిగువన ఈత
ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన తెలుగు విద్యార్థి అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మచిలీపట్నం చింతగుంటపాలెంకు చెందిన ట్రెజరీ ఉద్యోగి పొలుకొండ శ్రీనివాస్, మీనాకుమారిల కుమారుడు లెనిన్ నాగకుమార్ లేక్‌హెడ్ యూనివర్శిటీలో ఎంఎస్ చేస్తున్నాడు. అతడు 2021లో కెనడా వెళ్లాడు. నాగకుమార్ గత సోమవారం స్నేహితులతో కలిసి కెనడాలోని సిల్వర్ఫాల్స్కు వెళ్లాడు. అక్కడ ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడి మరణవార్త విని తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో ఉన్నారు.
మచిలీపట్నానికి చెందిన 23 ఏళ్ల విద్యార్థి కెనడాలోని అంటారియో సమీపంలోని సిల్వర్ ఫాల్స్ జలపాతంలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. మృతుడు పోలుకొండ నాగ లెనిన్ కుమార్ గా గుర్తించారు అక్కడి అధికారులు. లెనిన్ లేక్ యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్‌లో MSc చదువుతున్నాడు, 2021లో కెనడా వెళ్ళాడు. అతను ఇటీవలే తన చివరి సెమిస్టర్ పరీక్షలను రాశాడు. ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాడు. చదువు పూర్తి కావడంతో ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. సోమవారం లెనిన్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి సిల్వర్ ఫాల్స్ వద్దకు వెళ్లాడు. అక్కడే నీటిలో మునిగి చనిపోయాడు. ఈ సంఘటన తర్వాత లెనిన్తో పాటు ఉన్న అతని స్నేహితుల్లో ఒకరి నుండి తమకు ఫోన్ వచ్చిందని అతని మామ వేణుగోపాలరావు చెప్పారు.
సిల్వర్ ఫాల్స్‌కి విహారయాత్రకు వెళ్లారు. ఇద్దరు ఒడ్డున కూర్చొని ఉండగా, లెనిన్ మరో స్నేహితుడితో కలిసి జలపాతం దిగువన ఈత కొట్టడానికి వెళ్ళారు. లెనిన్‌కు ఈత తెలుసని చెప్పారు వేణుగోపాల రావు. అయితే నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో ఈత కొడుతుండగా అతను మునిగిపోయాడని అతని స్నేహితులు తెలిపారని అన్నారు రావు. లెనిన్ కష్టపడటం చూసి, అతని స్నేహితులు ఎమెర్జెన్సీ నెంబర్ ను సంప్రదించారు. స్థానిక పోలీసులు, రెస్క్యూ బృందం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ వారు అతని మృతదేహాన్ని బయటకు తీశారు. మచిలీపట్నం ఎంపి వల్లభనేని బాలశౌరి విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్‌తో పాటు ఒట్టావాలోని భారత హైకమిషనర్ సంజయ్ వర్మతో మాట్లాడి లెనిన్ భౌతికకాయాన్ని మచిలీపట్నానికి తీసుకురావడంలో సహాయం చేయాలని కోరారు.
Next Story