Sun Dec 22 2024 23:12:25 GMT+0000 (Coordinated Universal Time)
అప్సర కేసు : పీఎస్ లో సాయికృష్ణ హంగామా
అర్చకుడిగా పనిచేస్తున్న అయ్యగారి వెంకట సాయి సూర్యకృష్ణ - గుడికి వచ్చే అప్సరతో ప్రేమాయణం సాగించాడు. పోలీసుల అదుపులో..
సరూర్ నగర్ కు చెందిన మహిళ అప్సర (30) హత్యకేసు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. పెళ్లై భార్య, పిల్లలున్న సాయికృష్ణ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నదే కాకుండా.. ఆమె పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి చేయడంతో రాయితో తలపై కొట్టి హతమార్చి, కారును కప్పే కవర్లో మృతదేహాన్ని చుట్టి మ్యాన్ హోల్ లో డంప్ చేసి, దుర్వాసన రాకుండా సిమెంట్ చేశాడు. స్థానికులు మ్యాన్ హోల్ నుంచి దుర్వాసన వస్తుందని కంప్లైంట్ చేయడంతో అప్సర మృతదేహాన్ని నిన్న వెలికి తీశారు. ప్రస్తుతం ఉస్మానియా మార్చురీలో అప్సర మృతదేహానికి పోస్టుమార్టం చేస్తున్నారు.
కాగా.. అర్చకుడిగా పనిచేస్తున్న అయ్యగారి వెంకట సాయి సూర్యకృష్ణ - గుడికి వచ్చే అప్సరతో ప్రేమాయణం సాగించాడు. పోలీసుల అదుపులో ఉన్న అతను గతరాత్రి శంషాబాద్ పీఎస్ లో చనిపోతానంటూ హంగామా చేశాడు. అప్సర గర్భవతి అని, తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినందుకే చంపేశానంటూ బోరున విలపించాడు. పెళ్లి చేసుకోకపోతే తామిద్దరం కలిసి తీసుకున్న ఫొటోలను ఇంటర్నెట్ లో పెట్టి వైరల్ చేస్తానని బెదిరించడంతోనే ఆమెను చంపేశానంటూ ఏడ్చాడని పోలీసులు తెలిపారు. తాను ఆత్మహత్య చేసుకుని చనిపోతానని సాయికృష్ణ వాపోయాడని చెబుతున్నారు. జైలుకెళ్లినా తాను బతకనంటూ సాయికృష్ణ విలపించాడు. నిన్నరాత్రే సాయికృష్ణను చర్లపల్లి జైలులో రిమాండ్ కు తరలించారు పోలీసులు. అప్సర హత్య విషయం అతను పశ్చాత్తాపం పడుతున్నాడని తెలుస్తోంది.
Next Story