Mon Dec 23 2024 07:31:30 GMT+0000 (Coordinated Universal Time)
అప్సర కేసులో రోజుకో ట్విస్ట్.. వైరల్ అవుతోన్న పెళ్లిఫొటోలు
ఎలాంటి సంబంధం లేకపోతే అప్సర తనను పెళ్లిచేసుకోవాలని ఎందుకు ఒత్తిడి చేసింది ? సాయికృష్ణ వాట్సప్ నుంచి ప్రేమిస్తున్నా..
క్రైమ్ వెబ్ సిరీస్ లో ట్విస్టులు ఎలా ఉంటాయో.. ఇప్పుడు అప్సర హత్యకేసులో కూడా ట్విస్టులు అలానే ఉన్నాయి. మొదట అప్సర మిస్సింగ్ అంటూ కంప్లైంట్. కంప్లైంట్ లో మేనకోడలని పేర్కొన్నాడు సాయికృష్ణ. ఆ అమ్మాయికి మాకు ఎలాంటి సంబంధం లేదని సాయికృష్ణ కుటుంబం తెలిపింది. ఆ తర్వాత అప్సర తల్లి కూడా ఇదే చెప్పారు. అక్కయ్యగారూ అంటూ వచ్చేవాడే తప్ప.. అతను బంధువు కాదని స్పష్టం చేశారు. విచారణలో సాయికృష్ణ అప్సర ఎవరివల్లనో గర్భం దాల్చిందని, తనతో తాను శారీరకంగా ఎప్పుడూ కలవలేదని చెప్పడం గమనార్హం.
ఎలాంటి సంబంధం లేకపోతే అప్సర తనను పెళ్లిచేసుకోవాలని ఎందుకు ఒత్తిడి చేసింది ? సాయికృష్ణ వాట్సప్ నుంచి ప్రేమిస్తున్నా అని ఎందుకు మెసేజ్ చేశాడు ? పెళ్లిచేసుకోమని ఒత్తిడి చేసినంతమాత్రాన చంపేస్తారా ? ఇవి ఇప్పుడు అందరి నుంచి వస్తున్న ప్రశ్నలు. ఇక తాజాగా అప్సరకు గతంలోనే పెళ్లైందంటూ సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోల్లో అప్సర పక్కనే ఓ వ్యక్తి, అప్సర తల్లితో, అక్క, బావలతో కలిసి తీసుకున్న ఫ్యామిలీ ఫొటోలు ఉన్నాయి. అప్సరకు గతంలోనే పెళ్లైతే ఆ భర్త ఏమయ్యాడు ? ఎక్కడున్నాడు ? భర్త ఉండగా పూజారి సాయికృష్ణతో ఎందుకు వివాహేతర సంబంధం పెట్టుకుంది ? ఇలా ప్రశ్నలు తలెత్తాయి. అప్సరకు గతంలోనే పెళ్లవ్వగా భర్తతో విభేదాల కారణంగా పుట్టింట్లోనే ఉంటుందని తెలిసింది.
కాగా.. సాయికృష్ణ అప్సర గర్భవతి అని చెప్పగా.. పోస్టుమార్టం రిపోర్టులో అదంతా అబద్ధమని తేలింది. అప్సర గర్భవతి కాదని వైద్యులు రిపోర్టులో పేర్కొన్నారు. తనకు అప్సరకు శారీరక సంబంధం లేదని చెబుతున్న సాయికృష్ణ.. ఆమెకు చెన్నైలో బాయ్ ఫ్రెండ్ ఉన్నట్లు చెబుతున్నాడు. జనవరిలో అప్సర 3 నెలల గర్భిణి అని, అప్పుడే తనకు ఆమెపై అనుమానం వచ్చింద్నాడు. తనను పెళ్లిచేసుకోకపోతే ఇద్దరూ కలిసి తీసుకున్న ఫొటోలను నెట్టింట పోస్ట్ చేసి వైరల్ చేస్తానని అప్సర బెదిరించడంతోనే ఆమెను హతమార్చినట్లు అంగీకరించాడు. ప్రస్తుతం సాయికృష్ణ చర్లపల్లి జైలులో రిమాండ్ లో ఉన్నాడు.
Next Story