Sun Dec 22 2024 13:21:27 GMT+0000 (Coordinated Universal Time)
APSRTC: జడ్చర్లలో ఆర్టీసీ బస్సు దగ్ధం.. ధర్మవరం వెళుతుండగా
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎంను ఢీకొని ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. బురెడ్డిపల్లి వద్ద ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ధర్మవరం డిపోకు చెందిన సూపర్ డీలక్స్ బస్సు.. హైదరాబాద్ నుంచి 36 మంది ప్రయాణికులతో ధర్మవరం వెళుతుండగా జడ్చర్ల పట్టణంలోని బురెడ్డిపల్లి చౌరస్తాలో యూటర్న్ తీసుకుంటున్న డీసీఎంను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సుకు మంటలు అంటుకొని బస్సు పూర్తిగా దగ్ధమైంది.
ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు బస్సులోంచి దిగిపోవడంతో పెను ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ సీఐ ఆదిరెడ్డి సహాయక చర్యలు చేపట్టారు. అదేవిధంగా ఫైర్ సిబ్బంది ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని బస్సుకు అంటుకున్న మంటలను ఆర్పివేశారు. గాయపడిన ప్రయాణికులను జడ్చర్ల, మిడ్జిల్, భూత్పూర్, నవాబుపేట, హన్వాడ అంబులెన్స్‌లలో జిల్లా ఆస్పత్రికి తరలించారు.
Next Story