Fri Dec 20 2024 03:59:57 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో అరెస్ట్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ కొసాగుతున్నాయి. సమీర్ మహేంద్ర ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ ల పర్వం కొనసాగుతుంది. సమీర్ మహేంద్ర ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. సమీర్ మహేంద్రు, రామచంద్ర పిళ్లైతో కలసి మద్యం వ్యాపారం చేస్తున్నారు. నిన్న విజయ్ నాయర్ ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేయగా, ఈరోజు సమీర్ మహేంద్రను ఈడీ అరెస్ట్ చేసింది.
వసూళ్లకు పాల్పడి...
సమీర్ మహేంద్ర, రామచంద్రపిళ్లైలు కలసి 2.30 కోట్లు వసూలు చేసి కొందరు రాజకీయ నేతలకు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఈ డబ్బును ఏ విధంగా తీసుకెళ్లారని దానిపై ఈడీ అధికారులు ఇప్పటికే ఆధారాలు సేకరించినట్లు చెబుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరికొన్ని అరెస్ట్ లు ఉండే అవకాశముందని చెబుతున్నారు.
Next Story