Thu Dec 26 2024 10:03:43 GMT+0000 (Coordinated Universal Time)
America : అమెరికాలో హైదరాబాదీ విద్యార్థి మృతి
హైదరాబాద్ కు చెందిన ఆర్యన్ రెడ్డి తన సొంత తుపాకీ ప్రమాదవశాత్తూ పేలడంతో అమెరికాలో మరణించాడు
అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మరణించారు. హైదరాబాద్ కు చెందిన ఆర్యన్ రెడ్డి తన సొంత తుపాకీ ప్రమాదవశాత్తూ పేలడంతో మరణించాడు. జార్జియాలోని అట్లాంటాలో ఉన్న కెన్నెసా స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ రెండో ఏడాది ఆర్యన్ రెడ్డి చదువుతున్నాడు. ఈనెల 13వ తేదీన ఈ ఘటన జరిగినా ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది.
ఎంఎస్ రెండో ఏడాది...
ఆర్యన్ రెడ్డి గత ఏడాది డిసెంబరులో అమెరికాకు వెళ్లారు. ఈ నెల 13వ తేదీన తన ఫ్రెండ్స్ తో కలసి ఆర్యన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకున్నారు. అయితే అదే రోజు తన తుపాకీ గదిలో పేలడంతో ఆర్యన్ రెడ్డి మరణించినట్లు అతడి స్నేహితులు తెలిపారు. తుపాకీని శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తూ పేలిందని చెబుతున్నారు. దీంతో ఆర్యన్ రెడ్డి కుటుంబంలో విషాదం నెలకొంది.
Next Story