Mon Dec 23 2024 18:26:35 GMT+0000 (Coordinated Universal Time)
రోడ్డు ప్రమాదంలో..లేడీ సింగం, దబాంగ్ కాప్ మృతి
ఈ ప్రమాదం జరగడానికి కొన్నిగంటల ముందు జున్మణిపై దోపిడీ కేసు నమోదైంది. ఈ ప్రమాదంపై ఆమె కుటుంబ సభ్యులు..
అస్సాం పోలీసు విభాగంలో లేడీ సింగం, దబాంగ్ కాప్ గా పేరొందిన మహిళా ఎస్సై జున్మణి రాభా (30) మంగళవారం (మే16) తెల్లవారుజామున కారుప్రమాదంలో మృతి చెందారు. జున్మణి ప్రయాణిస్తోన్న ప్రైవేటు కారును నగావ్ జిల్లా పరిధి జఖలాబంధా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కంటైనర్ ట్రక్కు ఢీ కొట్టినట్లు అధికారులు తెలిపారు. నగావ్ ఎస్పీ లీనా డోలే ప్రమాద స్థలాన్ని గుర్తించారు.
ఈ ప్రమాదం జరగడానికి కొన్నిగంటల ముందు జున్మణిపై దోపిడీ కేసు నమోదైంది. ఈ ప్రమాదంపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ప్రమాదానికి కారణమైన ట్రక్కును పోలీసులు సీజ్ చేయగా.. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. రాత్రి వేళలో జున్మణి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా, యూనిఫాం లేకుండా ప్రైవేటు కారులో ఒంటరిగా ఎక్కడికి, ఎందుకు వెళ్తున్నారన్నది సస్పెన్స్ గా మారింది. పలు వర్గాల డిమాండ్ మేరకు.. ఈ కేసును సీఐడీకి బదిలీ చేస్తున్నట్లు అస్సాం డీజీపీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు.
Next Story